Andhra Pradesh : కాపులకు చంద్రబాబు సూపర్ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే కాపు సామాజికవర్గానికి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు

Update: 2024-08-26 06:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే కాపు సామాజికవర్గానికి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందింది. గత ఎన్నికల్లో తమ గెలుపునకు ప్రధాన కారణమైన కాపులను మరింత దగ్గరకు చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన వరాల జల్లు ప్రకటించడనున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో పందొమ్మిదికి పందొమ్మిది అసెంబ్లీ స్థానాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలకు పదిహేను నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. కాపు సామాజికవర్గం ఓట్లన్నీ కూటమి అభ్యర్థులకు బదిలీ కావడం వల్లనే ఇది సాధ్యమయిందని భావిస్తున్నారు.

రాయలసీమలోనూ...
రాయలసీమలోనూ బలిజ ఓటర్లు కూడా కూటమికి అండగా నిలిచారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమలోనూ యాభై ఆరు స్థానాలకు వైసీపీకి వచ్చింది కేవలం ఏడు నియోజకర్గాలు మాత్రమే. మిగిలిన 49 స్థానాల్లోనూ ఎన్నడూ లేని విధంగా కూటమి గెలుచుకుంది. ఇటువంటి చరిత్ర టీడీపీ కూటమికి ఎప్పుడూ లేదు. ప్రధానంగా వైెఎస్ జగన్ సొంత జిల్లా కడపలోనూ పది స్థానాలకు గానూ పది స్థానాల్లో కూటమి, వైసీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమయిందంటే అక్కడ కాపు సామాజికవర్గం బలంగా పార్టీ కోసం పనిచేసిందనే అందరి అంచనా. లేకపోతే ఇంతటి భారీ విజయం సాధ్యం కాదు.
కాపు కార్పొరేషన్ పదవిని...
అది జనసేన అధినేత పవన్ కల్యాణ్ వల్లనే సాధ్యమయింది. ఈ సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే కాపు సామాజికవర్గం కోసం ఏదో ఒకటి చేయాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు కాపు కార్పొరేషన్ పదవిని ఎటూ ఏర్పాటు చేస్తారు. దానికి ఛైర్మన్ తో పాటు పాలక వర్గాన్ని నియమించి పుష్కలంగా నిధులు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇప్పటికే కాపు నేతల నుంచి ఈ మేరకు డిమాండ్ వినిపిస్తుండటంతో తొలుత కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని ముఖ్యమైన విషయాలపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
రిజర్వేషన్లు...
ఇక కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య అనేక లేఖలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరుతున్నారు. ఈబీసీ కోటాలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు శాతం రిజర్వేషన్ ను కల్పించారు. అయితే సక్రమంగా అమలు చేయలేదన్న విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వం తమ మద్దతుపై ఆధారపడి ఉండటంతో ఈ సమస్యను సులువుగా అధిగమించే ఛాన్స్ ఉందని భావించి త్వరలోనే ఈబీసీ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు పకడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయం కూడా అతి త్వరలోనే వెల్లడిస్తారని సమాచారం. సో.. కాపులకు ఇది గుడ్ న్యూసే కదా?


Tags:    

Similar News